ఒకప్పుడు నేను కూడా బాడీ డిస్‌మార్ఫియాతో బాధపడ్డాను: హీరోయిన్ ఇలియానా
- తమ శరీర ఆకృతిపై బాధపడుతుంటారు
- దీన్ని బాడీ డిస్‌మార్ఫియా అంటారు
- తమలో ఏదో ఒక లోపం ఉన్నట్లు అనిపిస్తుంది
కొందరు అమ్మాయిలు తమకు మంచి పర్సనాలిటీ ఉన్నప్పటికీ, శరీర కొలతలన్నీ బాగానే ఉన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారని హీరోయిన్ ఇలియానా చెప్పింది. తమ శరీర ఆకృతి ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని అనుకుంటారని, దీన్ని బాడీ డిస్‌మార్ఫియా అంటారని, ఎంత అందంగా ఉన్నప్పటికీ అద్దంలో చూసుకున్నప్పుడు అటువంటి అమ్మాయిలకు తమలో ఏదో ఒక లోపం ఉన్నట్లు అనిపిస్తుందని ఇలియానా పేర్కొంది.
దాన్ని కవర్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పుకొచ్చింది. అయితే, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించినప్పుడే, మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మనం అందంగా కనిపిస్తామని తెలిపింది. ఈ విషయం చాలా మందికి తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఒకప్పుడు తాను కూడా బాడీ డిస్‌మార్ఫియాతో బాధపడ్డానని, అనంతరం తన శరీరంలో పాజిటివ్ అంశాలను చూడడం నేర్చుకున్నానని చెప్పింది. ఇప్పుడు తన శరీర ఆకృతి పట్ల పాజిటివ్‌గా ఆలోచిస్తూ దాని పట్ల గర్వంగా ఫీలవుతున్నానని తెలిపింది.