దోచుకుని, దాచుకోవడమే వైసీపీ ఎజెండా: విశాఖలో చంద్రబాబు
- ఇప్పటివరకు ఆయన స్పందించలేదు
- బెదిరిస్తూ వైసీపీ కేసులు పెడుతోంది
- అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోంది
- ఇటువంటి చేతగాని ప్రభుత్వం ఏపీకి అవసరమా?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు వి శాఖలోని పాత గాజువాకలో ఆయన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
ప్రశ్నించే వారిపై వైఎస్ జగన్ ప్రభుత్వం బెదిరిస్తూ కేసులు పెడతోందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల బట్టలు విప్పించే రోజు తొందర్లోనే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి చేతగాని ప్రభుత్వం ఏపీకి అవసరమా? అని అడిగారు.
ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. జగన్‌కు పరిపాలన చేతకావడం లేదని, దోచుకుని, దాచుకోవడమే వైసీపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడదామని జగన్ తో చెబితే ఆయన ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు.
ఎన్నికల ముందు జగన్ దొంగ పాదయాత్ర చేశారని, ఆ సమయంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో సర్వే చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అంతా నేర చరిత్ర ఉన్నవారేనని ఆయన చెప్పారు. విశాఖకు పట్టిన శని ఏ2ను వదిలించుకోవాలని అక్కడి ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.