ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ప‌డ్డ ఇంగ్లండ్

  • ఓపెన‌ర్లు క్రాలీ 5, సిబ్లీ 3 ప‌రుగులకే ఔట్
  • స్టోక్స్ 2 ప‌రుగులకే ఔట్, బైర్ స్టో డ‌కౌట్,
  • అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు రెండేసి వికెట్లు
  • 19 ఓవ‌ర్ల‌కు ఇంగ్లండ్ స్కోరు  45/4  
భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య అహ్మ‌దాబాద్‌లో జ‌రుగుతోన్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భార‌త బౌల‌ర్ల జోరు కొన‌సాగుతోంది. భార‌త బౌల‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఇంగ్లండ్ కీల‌క వికెట్ల‌ను ప‌డ‌గొట్టారు. ఆదిలోనే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ప‌డింది.  

ఇంగ్లండ్ ఓపెన‌ర్లు క్రాలీ 5, సిబ్లీ 3 ప‌రుగులకే ఔట‌య్యారు. అనంత‌రం బైర్ స్టో డ‌కౌట్ కాగా, ఆ త‌ర్వాతే స్టోక్స్ కూడా 2 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. క్రీజులో కెప్టెన్ రూట్స్ 24, పోప్ 4 ప‌రుగుల‌తో ఉన్నారు. టీమిండియా బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి.

కాగా, తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ 205 ప‌రుగుల‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవ‌ర్ల‌కు ఇంగ్లండ్ స్కోరు 45/4 గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 365 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం 115 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.


More Telugu News