ప్రజాసేవలో ఉన్నాను.. విమర్శిస్తే ఊరుకోను: నందమూరి బాలకృష్ణ వార్నింగ్
- హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా
- కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గానూ ప్రజలకు సేవ
- నటనతో ప్రజలకు వినోదంతో పాటు సందేశాలు అందిస్తున్నా
- మంత్రులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ లేదన్న బాలకృష్ణ
తాను ప్రజాసేవలో ఉన్నానని, తనను ఎవరైనా విమర్శిస్తే ఊరుకోబోనని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. హిందూపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... తాను హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. అలాగే కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గానూ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.
సినిమాల్లో నటనతో ప్రజలకు మంచి వినోదంతో పాటు సందేశాలు అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైసీపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నారని బాలకృష్ణ విమర్శించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేసి వైసీపీ సర్కారు ప్రజల నోట్లో మట్టి కొట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. నలుగురు మంత్రులు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.