వంద పరుగులు దాటిన భారత్ ఆధిక్యం

  • చివరి టెస్టులో పట్టు బిగిస్తున్న భారత్
  • అదరగొడుతున్న సుందర్
  • 300 దాటిన స్కోరు
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టుపై భరత్ పట్టు బిగుస్తోంది. టీమిండియా ఆధిక్యం వంద పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్సింగ్స్ మొదలు పెట్టిన భారత్ తొలుత వడివడిగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకుంది.

 ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. మరోవైపు, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చక్కని ఆటతీరుతో భారత్ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అక్షర్ పటేల్ అతడికి తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ తన తొలి ఇన్సింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. సుందర్ 70, పటేల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఆధిక్యం 105 పరుగులకు చేరింది.


More Telugu News