తమిళనాడులో 20 స్థానాల్లో బీజేపీ పోటీ.. అన్నాడీఎంకేతో కుదిరిన సయోధ్య
- ఒప్పందంపై ఇరు పార్టీల నేతల సంతకాలు
- కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి బీజేపీ పోటీ
- పోటీ చేసే స్థానాలను త్వరలో ప్రకటించనున్న బీజేపీ
తమిళనాడులో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయనుంది. అన్నాడీఎంకేతో జట్టుకట్టి బరిలోకి దిగుతున్న బీజేపీకి సీట్ల సర్దుబాటులో భాగంగా 20 స్థానాలు దక్కాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.
అలాగే, ఎంపీ వసంత్ కుమార్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన కన్యాకుమారి నుంచి కూడా బీజేపీ పోటీ చేయనుంది. వారం రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీ పార్టీల మధ్య ఈ అంగీకారం కుదిరింది. ఈ మేరకు అన్నాడీఎంకే కోఆర్డినేటర్ ఒ. పన్నీర్‌సెల్వం, జాయింట్ కోఆర్డినేటర్ ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ జాతీయ కార్యదర్శి సిటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
బీజేపీ పోటీ చేయనున్న స్థానాలపై త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీకి అన్నాడీఎంకే మద్దతు ఇస్తుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత హెచ్. వసంత్‌కుమార్ చేతిలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. అయితే, గతేడాది ఆగస్టులో కరోనా కారణంగా వసంత్ కుమార్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.