గ్లోబల్ ఉమన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్ కు ఏపీ గవర్నర్ అభినందనలు
- తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం
- అవార్డుకు ఎంపిక చేసిన మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్
- తమిళిసైకి అవార్డు సంతోషం కలిగించిందన్న బిశ్వభూషణ్
- మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్ష
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గ్లోబల్ ఉమన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. అమెరికా సంస్థ మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ తమిళిసైని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పొరుగు రాష్ట్రం గవర్నర్ కు అభినందనలు తెలియజేశారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత, సమానత్వం వంటి మహిళల హక్కుల పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళిసై అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కావడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పురస్కారాలు మరెన్నో ఆమె అందుకోవాలని ఏపీ గవర్నర్ ఆకాంక్షించారు.