హెరిటేజ్ పరువు నష్టం కేసులో.. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్

  • హెరిటేజ్ పై వ్యాఖ్యలు చేశారంటూ పరువునష్టం దావా
  • విచారణకు హాజరు కాని కన్నబాబు, అంబటి
  • ప్రజాప్రతినిధుల కోర్టు అసంతృప్తి
  • ఈ నేపథ్యంలోనే ఎన్బీడబ్ల్యూ జారీ 
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. కన్నబాబు, అంబటి హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా ఒకటి.. రెండు సార్లు కోర్టు హెచ్చరించినా  ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు అర్థమవుతోంది.


More Telugu News