సొంత నియోజకవర్గంలో రాహుల్ కి షాక్!

  • వయనాడ్ లో పార్టీకి దూరమైన నలుగురు నేతలు
  • వర్గపోరు తట్టుకోలేకే అని ప్రకటన
  • అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి ఎదురుదెబ్బ
కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. జనాల్లోకి చొచ్చుకెళ్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కేరళలోని ఆయన సొంత నియోజకవర్గం వయనాడ్ లో రాహుల్ కు ఊహించని షాక్ తగిలింది.

వయనాడ్ నియోజకవర్గానికి చెందిన నలుగురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెలకొన్న వర్గపోరు తట్టుకోలేకే పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు వారు ప్రకటించారు. అయితే వారిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. ఏదేమైనప్పటికీ ఐదేళ్ల తర్వాత కేరళలో మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ కు ఇది ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

పార్టీకి దూరమైన వారిలో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పీకే అనిల్ కుమార్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ఎంఎస్ విశ్వనాథన్, కేపీసీసీ మాజీ సభ్యుడు కేకే విశ్వనాథన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుజయ వేణుగోపాల్ ఉన్నారు.


More Telugu News