సుశాంత్ సింగ్ మృతి కేసులో రియాచక్రవర్తి సహా 33 మంది పేర్లతో ఛార్జిషీట్!
- ఛార్జిషీట్ లో రియాతో పాటు ఆమె సోదరుడి పేరు
- 200 మంది సాక్షుల వాంగ్మూలాలు
- 12 వేల పేజీల డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించిన ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. ఆ తర్వాత ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బాలీవుడ్ కు చెందిన ఎందరినో ఎన్సీబీ విచారించింది.
తాజాగా ఈరోజు ప్రత్యేక కోర్టుకు ఛార్జిషీట్ ను ఎన్సీబీ సమర్పించింది. ఇందులో 33 మంది పేర్లను ఎన్సీబీ చేర్చింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ తో పాటు డ్రగ్స్ సరఫరా చేసే పలువురి పేర్లను ఛార్జిషీట్ లో జోడించింది. 200 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చింది. మొత్తం 12 వేల పేజీల డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. గత ఏడాది జూన్ నెలలో ఎన్సీబీ విచారణను ప్రారంభించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి రియా, ఆమె సోదరుడితో పాటు పలువురిని ఇంతకు ముందు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.