చెత్త రికార్డుతో ధోనీ సరసన నిలిచిన కోహ్లీ
- టెస్టుల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఇండియన్ కెప్టెన్ గా కోహ్లీ
- 8 సార్లు డకౌట్ అయిన ధోనీ, కోహ్లీ
- ఒకే సిరీస్ లో రెండు సార్లు డకౌట్ కావడం ఇది రెండోసారి
ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకుని, ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. తన కెరీర్ ముగిసేలోగా మరెన్ని రికార్డులు సాధిస్తాడో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఈరోజు కోహ్లీ ఒక చెత్త రికార్డును సాధించాడు.
మొతేరాలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్ గా కోహ్లీకి టెస్టుల్లో ఇది ఎనిమిదో డకౌట్. భారత మాజీ కెప్టెన్ ధోనీ కూడా టెస్టుల్లో ఎనిమిది సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో, ఈ చెత్త రికార్డుతో ధోనీ సరసన కోహ్లీ చేరాడు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... టెస్టుల్లో ఒకే సిరీస్ లో రెండు సార్లు డకౌట్ కావడం కోహ్లీకి ఇది రెండో సారి. మరోవైపు మూడో టెస్టులో కోహ్లీ ఒక ఘనత సాధించాడు. స్వదేశంలో ఎక్కు మ్యాచులు గెలుపొందిన కెప్టెన్ల జాబితాలో ధోనీని కోహ్లీ అధిగమించాడు. 21 మ్యాచులను ధోనీ గెలుపొందగా... కోహ్లీ 22 మ్యాచుల్లో గెలుపొందాడు.