ఉద్యోగులకు బోనస్‌లు, ప్రమోషన్లు ప్రకటించిన కాగ్నిజెంట్!
- 24,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు
- 2021 జూన్ త్రైమాసికం నుంచే అమలు
- 1,60,000 మందికి బోనస్
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బోనస్‌లు, ప్రమోషన్లు ప్రకటించింది. 24,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. సంస్థ అట్రిషన్ తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ నంబియార్ తెలిపారు.
అంతేగాక, సీనియర్ అసోసియేట్స్ స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. 2021 జూన్ త్రైమాసికం నుంచే ఆ సంస్థ.. తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేయనుంది.
ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో పని చేస్తోన్న 1,60,000 మందికి బోనస్ ఇవ్వనున్నామని తెలిపింది. ఆ సంస్థ డిసెంబర్ 31తో త్రైమాసికంలో 4,184 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసుకుంది. ఇండియాలో ఆ సంస్థలో 2.9 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.