సీఎం కేసీఆర్ చేయిస్తున్న సర్వేలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి: బండి సంజ‌య్

  • టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఐటీఐఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు?
  • కేంద్ర మంత్రులను కలిసి వంగి వంగి దండం పెట్టారు
  • రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల కోసం నేను మీతో వ‌స్తా
  • కేంద్రమంత్రులు, ప్రధాని దగ్గరకు తీసుకెళ్తా  
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఐటీఐఆర్‌, రైల్వే కోచ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు కేంద్ర మంత్రులను కలిసి వంగి వంగి దండం పెట్టారు కదా! రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల కోసం నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని కేంద్రమంత్రులు, ప్రధాని దగ్గరకు తీసుకెళ్తా' అని బండి సంజ‌య్ చెప్పారు.

'మీరూ వస్తా అంటే మీ ఫామ్ హౌస్‌ కు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. 2017లో రైల్వే వ్యాగన్ ఓవర్ లింక్ వర్క్ షాప్ వచ్చింది. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి దొరుకుతోంది' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

'పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. సీఎం చేయిస్తున్న సర్వేలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. సర్వే రిపోర్టుల్లో బీజేపీ గెలుస్తోందని తెలిసి కేసీఆర్ బహురూపుల వేషం వేస్తున్నాడు. అందుకే గిమ్మిక్కులు చేస్తున్నాడు' అని బండి సంజ‌య్ చెప్పారు.

'ముఖ్యమంత్రి కనీసం పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించిండా? అది ఆయన అహంకారానికి నిదర్శనం. ఓటు అడగని పార్టీకి ఎందుకు ఓట్లు? మంత్రి నిరంజన్ రెడ్డి టీచర్లను బెదిరిస్తున్నాడు. మరోవైపు జుటా బాప్, జూటా బేటా! కొత్తగా లెటర్లు రాస్తున్నారు. ఈ లెటర్లే మిమ్మల్ని ఓడించబోతున్నాయి' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

'మేము గిరిజనుల కోసం వెళ్తే మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. టీఆర్ఎస్ పై అన్నివర్గాల్లో వ్యతిరేకత ఉంది. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే చందాల ద్వారానే టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

'ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే పీఆర్సీ వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. పోడు సమస్య తీరుతుంది. అందుకే బీజేపీకి ఓటువేసి గెలించాలని విజ్ఞప్తి' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.


More Telugu News