లంచ్ కి ముందు ఆఖరి బంతికి రహానే అవుట్!
- 38వ ఓవర్ లో రహానే అవుట్
- 27 పరుగులు చేసిన రహానే
- ఇంగ్లండ్ స్కోరుకి 125 పరుగుల దూరం
మరొక్క బంతి పడితే, లంచ్ విరామం వస్తుందన్న సమయంలో కుదురుకుని ఆడుతున్నాడని భావించిన అజింక్య రహానే అవుట్ కావంతో, ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో నాలుగో వికెట్ ను కోల్పోయింది. 38వ ఓవర్ ను వేసిన ఆండర్సన్, తన 5వ బంతికి రహానేను అవుట్ చేశాడు. రహానే బ్యాటుకు తగిలిన బంతి నేరుగా సెకండ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ చేతుల్లోకి వెళ్లింది. మొత్తం 47 బంతులాడిన రహానే 4 ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు.
ప్రస్తుతం భారత స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు కాగా, ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఓపికగా ఆడుతూ 32 పరుగుల వద్ద ఉన్నాడు. టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ దారి పట్టడంతో, ఈ మ్యాచ్ లో భారత్ ఆధిక్యం పొందాలంటే, రోహిత్ శర్మ నిలబడి భారీ స్కోరును సాధించాల్సిన పరిస్థితి. లంచ్ విరామం తరువాత రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రానుండగా, ఇంగ్లండ్ స్కోరును దాటాలంటే, టీమిండియా మరో 125 పరుగులు చేయాల్సి వుంది.