తమకు కొవాగ్జిన్ కావాలంటున్న ఫ్రాన్స్!
- భారత్ బయోటెక్ తో డీల్
- ఫ్రాన్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు
- కృష్ణ ఎల్లతో చర్చించిన ఫ్రాన్స్ రాయబారి
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ ను తమకు సరఫరా చేయాలని కోరుతున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్రెజిల్- భారత్ బయోటెక్ మధ్య డీల్ కుదరగా, తాజాగా ఫ్రాన్స్ కూడా ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్ లో నివాసులందరికీ టీకాను ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తక్కువ ధరలో లభిస్తూ, సత్ఫలితాలను ఇస్తున్న కొవాగ్జిన్ అయితే ఉత్తమమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఇండియాలో ఫ్రాన్స్ రాయబారిగా పనిచేస్తున్న ఎమ్మాన్యుయేల్ లేనేయిన్ ఈ మధ్యనే హైదరాబాద్ కు వచ్చి భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లను కలిసి ఈ డీల్ పై చర్చించారు కూడా. అయితే, ఫ్రాన్స్ ప్రస్తుతం ఈయూ (యూరోపియన్ యూనియన్)లో భాగస్వామిగా ఉండటంతో, ఏ దేశానికి టీకా రావాలన్నా యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈఎంయూ అనుమతి కోసం ఫ్రాన్స్ వేచిచూస్తోంది.
కాగా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 81 శాతం సామర్థ్యాన్ని కలిగివుందని మూడవ దశ క్లినికల్ పరీక్షల తరువాత వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అత్యవసర వినియోగానికి ఈ టీకాకు అనుమతులు లభించగా, నేడో, రేపో పూర్తి స్థాయి అనుమతులు కూడా వస్తాయని సమాచారం. అనుమతులు లభిస్తే, ఇండియాలో భారీ ఎత్తున సరఫరా చేయడంతో పాటు, టీకాను విదేశాలకు ఎగుమతి చేయాలని కూడా సంస్థ భావిస్తోంది. టీకా కోసం దాదాపు 40 దేశాలు తమను సంప్రదిస్తున్నాయని ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాఖ్యానించడం గమనార్హం. నెలకు 4 కోట్ల డోస్ లను తయారు చేసేలా సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం మూడవ ప్లాంటును కూడా సంస్థ నిర్మిస్తోంది.