ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి బంద్ పిలుపు
- బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతు
- మూతపడిన విద్యాసంస్థలు
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా చేపట్టిన బంద్ మొదలైంది. ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపు మేరకు బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయి. ప్రజా, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, లారీ యజమానుల సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంద్ కొనసాగనుంది. బంద్ సందర్భంగా మద్దిలపాలెంలో వామపక్షాలు రోడ్డెక్కి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు.