శ్రీకాకుళం జిల్లాలో 42 నాటు బాంబులు లభ్యం
- కంచిలి మండలంలో కార్డన్‌సెర్చ్
- గొల్లకంచిలో ఓ ఇంట్లో నిల్వ చేసిన బాంబులు
- పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసమేనన్న పోలీసులు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో నాటుబాంబులు బయటపడ్డాయి. గొల్ల కంచిలి గ్రామంలోని ఓ గుడిసెలో నిల్వ చేసిన 42 బాంబులను పోలీసులు గుర్తించారు. అవి పేలకుండా వెంటనే వాటిని నీళ్లలో పడేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం వీటిని ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ వర్గం వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.