తొలి రోజే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడ్డ ఇంగ్లండ్
- భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లో నాలుగో టెస్టు
- ఓపెనర్లు జాక్ క్రాలే 9, సిబ్లీ 2 పరుగులకే ఔట్
- అనంతరం బైర్స్ట్రో 28, రూట్ 5 కూడా
- మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ కి రెండేసి వికెట్లు
భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లో జరుగుతోన్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేస్తోంది. అయితే, భారత ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయింది.
ఓపెనర్లు జాక్ క్రాలే 9, సిబ్లీ 2 పరుగులకే అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యారు. బైర్స్ట్రో 28 పరుగులకు, కెప్టెన్ రూట్ 5 పరుగులకు సిరాజ్ బౌలింగ్లో వెనుదిరిగారు. క్రీజులో స్టోక్స్ 28, పోప్ 2 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు 31 ఓవర్ల వద్ద 81/4గా ఉంది. భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ కి రెండేసి వికెట్లు దక్కాయి.