వేలకోట్ల ప్రజాధనంతో పోర్టులుకట్టి ప్రైవేటుకు అప్పజెబుతారా?: దేవినేని ఉమ

  • పోర్టులన్నీ మావేనంటున్న సంస్థలు ఎవరివి?
  • రిస్కులతో కూడిన నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందా?
  • లాభదాయకమైన నిర్వహణ ప్రైవేటుకా?
  • ఇందులో ఆంతర్యం ఏంటి?  
'స‌ర్కారు వారి రేవు పార్టీ' పేరిట 'ఆంధ్ర‌జ్యోతి'లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ వైసీపీ స‌ర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల నిర్మాణంలో ‘రిస్క్‌’ను తగ్గిస్తూ వాటి నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

రిస్క్‌ లేని నిర్వహణ కోసం వాటిని ప్రైవేటుకు అప్పగిస్తుందని చెప్పారు.  ప్రభుత్వానికి అధిక ఆదాయమిచ్చే ప్రైవేటు సంస్థను కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా ఎంపిక చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారని  ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. అయితే, ప్రజల ప‌న్నుల‌తో కట్టే పోర్టులను అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టే భారీ వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అందులో చెప్పారు. వీటిని దేవినేని ఉమ ప్ర‌స్తావించారు.

'వేలకోట్ల ప్రజాధనంతో పోర్టులుకట్టి ప్రైవేటుకు అప్పజెబుతారా? పోర్టులన్నీ మావేనంటున్న సంస్థలు ఎవరివి? రిస్కులతో కూడిన నిర్మాణం ప్రభుత్వం చేపట్టి లాభదాయకమైన నిర్వహణ ప్రైవేటుకు అప్పజెప్పడంలో ఆంతర్యం ఏంటి? ప్రజలసొమ్మును అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టే హక్కు మీ కెవరిచ్చారు  వైఎస్ జ‌గ‌న్?' అని దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.


More Telugu News