ఏపీ రాజధాని అమరావతికి రైల్వే స్టేషన్ ఇక లేనట్టే!
- విభజన సమయంలో హామీ
- ఖర్చును భరించేందుకు ప్రభుత్వం విముఖత
- తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ కూడా లేనట్టే
ఓ వైపు విజయవాడ, మరోవైపు గుంటూరు వంటి నగరాలు కూతవేటు దూరంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైన్ విషయంలో లోటు లోటుగానే మిగిలింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు, కృష్ణా జిల్లా పెద్దాపురం నుంచి నంబూరు వరకూ, అమరావతి నుంచి పెదకూరపాడు వరకు, సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వరకూ సింగిల్ లైన్లకు గతంలో కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, అప్పట్లో కేంద్రం ఇచ్చిన విభజన హామీలు ఇప్పుడు అమలయ్యేలా లేదు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఖర్చును పంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే తామేమీ ఛేయలేమని పేర్కొంది.
ఇక ఇదే సమయంలో తెలంగాణకు ఇస్తామని హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ అనవసరమని భావిస్తున్నామని అంటూ, అసలు దేశంలో ఎక్కడా ఇటువంటి ఫ్యాక్టరీలను నిర్మించాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ పేర్కొనడం గమనార్హం.