అలా కోరుకున్న తొలి వ్యక్తిని నేనే.. అందుకే సీనియర్లకు టార్గెట్ అయ్యా: రాహుల్ గాంధీ
- యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐలో ఎన్నికలు జరగాలని పట్టుబట్టా
- పార్టీ వ్యక్తులే నన్ను టార్గెట్ చేశారు
- అప్పుడు అధికారం కోసం, ఇప్పుడు దేశం కోసం పోరాటం
పార్టీలోని సీనియర్లకు తాను ఎందుకు టార్గెట్‌గా మారానన్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓ యూనివర్సిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్‌తోపాటు పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్‌యూఐలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని పట్టుబట్టిన తొలి వ్యక్తిని తానేనని, అందుకనే సీనియర్లకు తాను టార్గెట్‌గా మారానని వ్యాఖ్యానించారు. తన పార్టీ వ్యక్తులే తనపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు.
పార్టీని సరైన రీతిలో నడిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాలని, ఆ పాత్రను సమర్థంగా పోషించడానికి కాంగ్రెస్ సమాయత్తం కావాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము మొదటి నుంచీ శాంతియుతంగానే ఉన్నామని అన్నారు. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారని, అలాంటి వారందరినీ ఒక చోటుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాహుల్ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల కంటే ముందు తాము గెలిచేందుకు పోటీ చేశామని, ఇప్పుడు మాత్రం దేశం కోసం పోరాడుతున్నామని రాహుల్ వివరించారు.