ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!
- గత 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు
- 135 మందికి పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 31 కొత్త కేసులు
- విశాఖ జిల్లాలో 23 మందికి పాజిటివ్
- 826 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో ఇటీవల 100కు దిగువనే వస్తున్న కరోనా రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ అధికమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు నిర్వహించగా 135 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 31 పాజిటివ్ కేసులు రాగా, విశాఖ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 15, శ్రీకాకుళం జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 10 కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరులో ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,215 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,219 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 826 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,170కి చేరింది.