ఎల్లుండి ఏపీ బంద్‌... కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ద్ద‌తు

  • విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్య‌తిరేకంగా బంద్
  • ఇప్ప‌టికే వామపక్ష పార్టీల మ‌ద్ద‌తు
  • విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
  • బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలన్నా శైలజానాథ్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్లుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంద్ నిర్వ‌హించ‌నున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్ పిలుపున‌కు ప‌లు రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.  

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపున‌కు త‌మ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ రోజు ప్ర‌క‌టించారు. ఈ బంద్‌కు ఇప్ప‌టికే వామపక్ష పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు.  

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ఫ్యాక్టరీ అమ్మకం నిర్ణయంపై కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గాల్సిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీ బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను విజ‌య‌వంతం చేసి, విశాఖ ఉక్కుపై ఆంధ్ర ప్రజల హక్కును  కాపాడుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.


More Telugu News