'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ను తీసుకువచ్చిన రాజమౌళి
- రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
- రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ చిత్రం
- ప్రస్తుతం క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ
- సెట్స్ పై కనిపించిన స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్
- క్లైమాక్స్ ఇక ఊపందుకుంటుందని చిత్రబృందం ట్వీట్
టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఎంత శ్రమిస్తారో తెలిసిందే. సంవత్సరాల తరబడి చిత్రీకరణ జరిపేందుకు కూడా ఆయన వెనుకాడరు. బాహుబలి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
అయితే క్లైమాక్స్ చివరి అంచె షూటింగ్ కోసం రాజమౌళి ప్రత్యేకంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ ను రప్పించారు. నిక్ పావెల్ కత్తియుద్ధంలో నిపుణుడు. సెట్స్ పై తనదైన శైలిలో నిక్ పావెల్ సూచనలు ఇస్తున్న వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్రబృందం విడుదల చేసింది. క్లైమాక్స్ చిత్రీకరణలో ఊపు లేదని మీరనుకుంటుండొచ్చు... ఇదిగో నిక్ పావెల్ వచ్చేశాడు అంటూ పేర్కొంది.
నిక్ పావెల్ గతంలో బ్రిటన్ వూషూ టీమ్ తరపున యూరోపియన్ చాంపియన్ షిప్ లో పతకం గెలుచుకున్నాడు. అనేక యుద్ధ విద్యలను అధ్యయనం చేసిన అనుభవంతో హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా సేవలు అందించాడు. బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్, మమ్మీ, ది లాస్ట్ సమురాయ్, సిండ్రెల్లా మ్యాన్ వంటి చిత్రాలకు పోరాట సన్నివేశాలు రూపకల్పన చేసి విమర్శలకు ప్రశంసలు అందుకున్నాడు. నిక్ పావెల్ బాలీవుడ్ లో మణికర్ణిక చిత్రానికి కూడా స్టంట్స్ కు రూపకల్పన చేశాడు.