82 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం: మోదీ
- మారిటైమ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులను పెంచుతాం
- 23 వాటర్ వేస్ ని అందుబాటులోకి తీసుకొస్తా
- జల రవాణాలో ఇండియా పెద్ద శక్తిగా ఎదుగుతోంది
పోర్ట్స్ ప్రాజెక్టుల్లో 2035 నాటికి 82 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని ప్రధాని మోదీ తెలిపారు. మారిటైమ్ (సముద్ర సంబంధిత) సెక్టార్ లో పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులను పెంచుతామని చెప్పారు. దేశంలోని పోర్టుల మధ్య జల రవాణాను పెంచుతామని అన్నారు. మారిటైమ్ సమ్మిట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
షిప్ యార్డులు, వాటర్ వేస్, పోర్టుల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. 2015 నుంచి 2035 మధ్యలో 574 ప్రాజెక్టులకు పైగా చేపడతామని... వీటి విలువ రూ. 6 లక్షల కోట్లకు పైగా (82 బిలియన్ డాలర్లు) ఉంటుందని అన్నారు. 2030 నాటికి 23 వాటర్ వేస్ ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనంతగా జల మార్గాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మోదీ అన్నారు. జల రవాణా వల్ల ఖర్చు ఎంతో తగ్గుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల టూరిజం కూడా పెరుగుతుందని అన్నారు. అన్ని మేజర్ పోర్టుల్లో సోలార్, విండ్ పవర్ సిస్టమ్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జలరవాణాలో ఇండియా పెద్ద శక్తిగా ఎదుగుతోందని అన్నారు. మరోవైపు... భారత సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న 189 లైట్ హౌసుల్లో 78 లైట్ హౌసులను టూరిజం కేంద్రాలుగా కేంద్రం అభివృద్ధి చేయాలనుకుంటోంది.