విశాఖను అభివృద్ధి చేసే బాధ్యత వైసీపీ తీసుకుంటుంది: విజయసాయి రెడ్డి
- వైద్య రంగంలో జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారు
- ఇవ్వని హామీలను కూడా జగన్ నెరవేర్చారు
- సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందించాలనేది జగన్ లక్ష్యం
ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని 94వ వార్డు, 95వ వార్డు, వేపగుంట, పాపయ్యరాజుపాలెం ఏరియాలలో విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ తదితరులు గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైయస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందజేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం వైయస్ జగన్.. నాడు-నేడు ద్వారా విద్యా ప్రమాణాలను పెంచారని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.