రక్తపు మడుగులో న్యాయవాది మృతదేహం.. అనుమానాస్పద మృతి కేసు నమోదు
- కడప జిల్లా కేంద్రంలో ఘటన
- రాజారెడ్డి వీధికి చెందిన న్యాయవాది పి.సుబ్రమణ్యం మృతి
- ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన న్యాయవాది
- అపార్ట్‌మెంటు కింద మృతదేహం లభ్యం
కడప జిల్లా కేంద్రంలో ఓ న్యాయవాది అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. రాజారెడ్డి వీధికి చెందిన న్యాయవాది పి.సుబ్రమణ్యం గత రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా ఆయన సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని వారికి తెలిసింది.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి ఆయన కోసం వెతికారు. అక్కడే సుబ్రమణ్యం చెప్పులు ఉన్నాయి కానీ, మనిషి లేకపోవడంతో అపార్ట్ మెంట్ పరిసరాల్లో వెతికారు. అపార్ట్‌మెంట్ కింద అతని మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసిన పోలీసులు ఆయన మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
ఆయనను ఎవరైనా హత్యా చేశారా? లేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతులను కొందరు దారుణంగా హత్య చేసిన ఘటనను మరవకముందే ఏపీలో మరో న్యాయవాది దారుణ రీతిలో మృతి చెందడం గమనార్హం.