ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలాస్ సర్కోజీకి జైలుశిక్ష

  • 2007లో ముడుపులు స్వీకరించినట్టు ఆరోపణలు
  • విచారణ చేపట్టిన జడ్జి గిల్బెర్ట్ అజిబెర్ట్
  • జడ్జిని ప్రలోభాలకు గురిచేసినట్టు సర్కోజీపై మరో కేసు
  • అభియోగాలు నిరూపితం కావడంతో మూడేళ్ల జైలుశిక్ష
  • రెండేళ్ల శిక్షను సస్పెన్షన్ లో ఉంచిన కోర్టు
ఫ్రాన్స్ మాజీ దేశాధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఓ అవినీతి కేసులో దోషిగా తేలారు. ఓ జడ్జినే ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారన్న కేసులో సర్కోజీపై మోపిన అభియోగాలను కోర్టు నిర్ధారించింది. మూడేళ్ల జైలుశిక్ష విధించగా, అందులో రెండేళ్ల జైలుశిక్షను సస్పెన్షన్ లో ఉంచింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు ఆయనకు 10 రోజుల సమయం ఇచ్చింది.

సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆధునిక తరంలో ఫ్రాన్స్ కు అధ్యక్షుడిగా వ్యవహరించి జైలుశిక్షకు గురైన రెండో వ్యక్తి సర్కోజీ. గతంలో జాక్వెస్ చిరాక్ కూడా అవినీతి కేసులో దోషిగా నిర్ధారణ అయ్యాడు.

2007 అధ్యక్ష ఎన్నికల సమయంలో 'లో రియల్' ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ వారసురాలు లిలియానే బెట్టెన్ కోర్ట్ నుంచి అక్రమ చెల్లింపులను స్వీకరించాడంటూ సర్కోజీపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో విచారణ జరుపుతున్న జడ్జి గిల్బెర్ట్ అజిబెర్ట్ ను ప్రలోభానికి గురిచేశాడని, కీలక సమాచారం తనకందిస్తే మొనాకోలో భారీ ఆస్తిని సొంతం చేస్తానని ఆఫర్ ఇచ్చాడని సర్కోజీపై మరో కేసు నమోదైంది. ఈ కేసులోనే సర్కోజీకి తాజాగా శిక్ష పడింది.


More Telugu News