చెన్నైలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వెంకయ్యనాయుడు
- భారత్ లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
- 60 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్
- చెన్నైలో వ్యాక్సిన్ వేయించుకున్న ఉపరాష్ట్రపతి
- ప్రభుత్వ వైద్యకళాశాలలో టీకా తీసుకున్నట్టు ట్విట్టర్ లో వెల్లడి
దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా టీకా వేయించుకున్నారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. దీనిపై వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో వెల్లడించారు. మరో 28 రోజుల తర్వాత రెండో డోసును తీసుకుంటానని తెలిపారు. అర్హులైన ప్రజలందరూ కరోనా టీకా తీసుకునేందుకు చురుగ్గా ముందుకు రావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. తద్వారా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాలుపంచుకోవాలని తెలిపారు.