బెంగాల్ లో 8 దశల పోలింగ్ వద్దంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

  • దేశంలో 5 అసెంబ్లీలకు ఎన్నికలు
  • ఇటీవల షెడ్యూల్ ప్రకటన
  • పశ్చిమ బెంగాల్ లో 8 విడతలుగా పోలింగ్
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాది ఎంఎల్ శర్మ
ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం తెలిసిందే. అయితే, పశ్చిమ బెంగాల్ లో 8 విడతలుగా పోలింగ్ జరపనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెంగాల్ లో 8 విడతల్లో పోలింగ్ జరపకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ శర్మ తన పిటిషన్ లో కోరారు. ఇన్ని దశల్లో పోలింగ్ నిర్వహించడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లను ఉల్లంఘించడమేనని తెలిపారు.

అంతేగాకుండా, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా మతపరమైన నినాదాలు చేస్తుండడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, ఇతర మతపరమైన నినాదాలు ప్రజల్లో మత విభేదాలకు కారణమవుతున్నాయని... ఇది ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం నేరం అని వివరించారు.


More Telugu News