విమానాశ్రయంలో ఫోన్లు తీసేసుకున్న పోలీసులు.. మండిపడ్డ చంద్రబాబు
- చంద్రబాబుతో పాటు పీఏ, వైద్యాధికారి ఫోన్లను తీసుకున్న పోలీసులు
- తాను కలెక్టర్ తో పాటు, ఎస్పీలను కలుస్తానన్న చంద్రబాబు
- అనుమతి ఇచ్చేవరకు కదలబోనంటూ స్పష్టీకరణ
తిరుపతిలోని గాంధీ విగ్రహ కూడలికి వెళ్లి, నిరసన కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి వెళ్లాలని కోరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పీఏ, వైద్యాధికారి ఫోన్లను పోలీసులు తీసేసుకున్నారు. తాను కలెక్టర్ తో పాటు, తిరుపతి, చిత్తూరు ఎస్పీలను కలిసి, తన పర్యటనను అడ్డుకోవడంపై వినతి పత్రం ఇస్తానని పోలీసులకు చంద్రబాబు నాయుడు చెప్పారు.
అధికారులను కలిసేందుకు కూడా పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో అనుమతి ఇవ్వాల్సిందేనని చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. అనుమతి ఇచ్చేవరకు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి కదలబోనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు కూడా తనకు లేదా? అంటూ మండిపడ్డారు.