విమానాశ్రయంలోనే బైఠాయించి చంద్రబాబు నిరసన.. ఉద్రిక్తత.. వీడియో ఇదిగో
- తిరుపతిలో నిరసన తెలపడానికి వచ్చిన చంద్రబాబు
- నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు
- విమానాశ్రయానికి వస్తున్న టీడీపీ శ్రేణులు
వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తిరుపతిలోని గాంధీ విగ్రహ కూడలిలో నిరసనకు టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరోనా నిబంధనల కారణంగా నిరసనకు అనుమతి ఇవ్వట్లేదని పోలీసులు అంటున్నారు.
టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వస్తున్నారు. చెప్పింది వినకుండా నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు.