భారత్, పాక్ మంచి స్నేహితులుగా ఉండడాన్ని చూడాలనుకుంటున్నా: మలాలా

  • అది తన కల అని వెల్లడి
  • ప్రజలు పరస్పరం పర్యటించవచ్చని వివరణ
  • పాక్ కళాకారుల నాటకాలు భారతీయులు చూడొచ్చన్న మలాలా
  • తాము బాలీవుడ్ సినిమాలు, మ్యాచ్ లు చూస్తామని వ్యాఖ్యలు
చిన్నవయసులోనే బాలికల విద్యా హక్కు కోసం పోరాడి తాలిబాన్ల తుపాకీ తూటాలు ఎదుర్కొన్న సాహసవనిత, నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ భారత్, పాకిస్థాన్ సంబంధాలపై స్పందించారు. దాయాది దేశాలు రెండూ ఎంతో సఖ్యతగా కలిసి మెలిసి ఉండడాన్ని చూడాలనుకుంటున్నానని, అది తన కల అని వివరించారు. అప్పుడు ఇరు దేశాల వారు పరస్పరం ఒక దేశం నుంచి మరో దేశంలో పర్యటించే వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"పాకిస్థాన్ కళాకారులు ప్రదర్శించే నాటకాలను భారతీయులు తిలకించవచ్చు... మేం కూడా బాలీవుడ్ సినిమాలను, క్రికెట్ మ్యాచ్ లను హాయిగా ఆస్వాదించవచ్చు" అని వివరించారు. అయితే, పాకిస్థాన్ లో కానీ, భారత్ లో కానీ మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని మలాలా నొక్కి చెప్పారు. ఆ అంశం మతపరమైన కోణంలా చూడరాదని, అధికార దోపిడీ కోణం నుంచి పరిగణనలోకి తీసుకుని, తీవ్రంగా పరిశీలించాలని కోరారు.


More Telugu News