పీవీ బతికుంటే వాణీదేవి మాటలకు ఆత్మహత్య చేసుకునేవారు: సీపీఐ నారాయణ
- తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న పీవీ కుమార్తె వాణీదేవి
- పీవీతో కేసీఆర్ ను పోల్చిన వాణీదేవి
- హాస్యాస్పదంగా ఉందన్న నారాయణ
- ఓట్ల కోసం పీవీ పేరు వాడుకుంటున్నారని విమర్శలు
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశాన్ని గట్టెక్కించింది పీవీ అయితే, తెలంగాణను కాపాడింది కేసీఆర్ అంటూ వాణీదేవి పేర్కొన్నారు. అంతేకాదు, అనేక అంశాల్లో తన తండ్రి పీవీకి, సీఎం కేసీఆర్ కు మధ్య సారూప్యతలు ఉన్నాయని అన్నారు. దీనిపై సీపీఐ అగ్రనేత నారాయణ తనదైన శైలిలో స్పందించారు.
కేసీఆర్ ను వాణీదేవి తన తండ్రి పీవీతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వాణీదేవి మాటలకు పీవీ బతికుంటే ఆత్మహత్య చేసుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరుతో ప్రచారం చేస్తే ఓట్లు వేయరనే పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని నారాయణ విమర్శించారు. పీవీ భుజంపై తుపాకీ పెట్టిన కేసీఆర్ కాంగ్రెస్ ను కాల్చుతున్నారని అభిప్రాయపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నాగేశ్వర్, జయసారథి గెలుపు ఖాయమని నారాయణ స్పష్టం చేశారు.