ప్రజలకు సేవ చేయాలన్న కోరికతోనే పోటీ చేస్తున్నా: పీవీ కుమార్తె వాణీదేవి
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాణీ
- నిరుద్యోగుల సమస్యలు తనకు తెలుసని వ్యాఖ్య
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో పోటీ చేస్తోన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ఈ రోజు హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు.
కృష్ణకాంత్ పార్క్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే కాసేపు ప్రాణాయామం చేశారు. అక్కడకు వచ్చిన వారితో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్న కోరికతోనే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు తనకు తెలుసని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. తాము ఎమ్మెల్సీగా ఎన్నికైతే అని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.