కోరలు లేని ఐసీసీ ఇండియాను ఏం చేస్తుంది?: మైకేల్ వాగన్
- రెండు రోజుల్లో ముగిసిన మూడవ టెస్ట్
- పిచ్ ని తీవ్రంగా తప్పుబట్టిన మైకేల్ వాగన్
- ఇండియా ఏం చేసినా ఐసీసీ స్పందించడం లేదని విమర్శ
క్రికెట్ ప్రపంచంలో అత్యంత బలమైన ఇండియా ఏం చేసినా, ఐసీసీ కలుగజేసుకునే ధైర్యం చేసే అవకాశాలు లేవని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తుండగా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ కనీసం మూడు రోజులు కూడా సాగకుండా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రోజులు ఆడాల్సిన టెస్ట్ క్రికెట్ కు ఈ తరహా పిచ్ లను తయారు చేయడం ఏంటని విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా ఇదే విషయమై స్పందించిన మైకేల్ వాగన్, ఐసీసీకి కోరలు లేవని విమర్శలు గుప్పించాడు. ఇండియా వంటి బలమైన దేశాలు, తమకు నచ్చినట్టుగా పిచ్ లను తయారు చేసుకుంటుంటే, తన కంటికి ఐసీసీ కోరలే లేని పులిలా కనిపిస్తోందని అన్నాడు. ఏం చేసినా, ఎలా చేసినా ఐసీసీ ఇండియాకు అనుమతులు ఇస్తూనే ఉందని, ఈ తరహా చర్యలతో టెస్ట్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతోందని అభిప్రాయపడ్డాడు.