బాలాకోట్ దాడులు చేసిన వాయుసేన టీమ్ ముందు మరో టాస్క్!
- రెండేళ్ల క్రితం బాలాకోట్ దాడులు
- ప్రాక్టీస్ బాంబింగ్ చేసిన నాటి బృందం
- పర్యవేక్షించిన ఎయిర్ చీఫ్ మార్షల్
దాదాపు రెండు సంవత్సరాల క్రితం పాకిస్థాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడి చేసిన భారత వాయుసేన టీమ్, ఇప్పుడు సుదూర ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించడాన్ని ప్రాక్టీస్ చేస్తోంది. బాలాకోట్ దాడులు జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన వేళ, అదే స్క్వాడ్రన్ బృందం ప్రాక్టీస్ బాంబింగ్ జరిపిందని వీటిని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బహదూరియా పర్యవేక్షించారని సైనిక వర్గాలు వెల్లడించాయి.
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయంపై ఆత్మాహుతి దాడికి దిగిన ముష్కరులు భారీ ఎత్తున ఆయుధాలతో విరుచుకుపడగా, 40 మంది జవాన్లు వీరమరణం పొందారన్న సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా వాస్తవ నియంత్రణా రేఖకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదుల క్యాంపుపై 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు దాడికి వెళ్లాయి.