ప్రియుడిని చంపించేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి!
- మహారాష్ట్రలోని నాగపూర్ లో ఘటన
- ప్రియురాలి పెళ్లిని అడ్డుకుంటున్న ప్రియుడు
- హంతకులను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్
తన పెళ్లికి అడ్డుపడుతున్న ప్రియుడిని హతమార్చేందుకు ఏ యువతి ఇవ్వని ఆఫర్ ను సుపారీగా ప్రకటించి, తన లక్ష్యం సాధించి, ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల వెనక కాలం గడుపుతోంది. తాను చెప్పినట్టు చేస్తే, రూ. 1.50 లక్షల డబ్బుతో పాటు, ఓ రాత్రి ఏకాంతంగా గడుపుతానని ఆమె ఇచ్చిన ఆఫర్ అతనికి నచ్చడంతో, వెంటనే పని పూర్తి చేసేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...
చందూ మహాపూర్ అనే వ్యక్తికి, ఇప్పటికే వివాహం కాగా, మరో అవివాహిత యువతితో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. అవివాహిత వయసు 20 సంవత్సరాలు కాగా, ఆమెకు ఇటీవల మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లిని ఇష్టపడని చందూ, పెళ్లి చేసుకోవద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఆ యువతి తీవ్ర ఆగ్రహంతో అతన్ని చంపించాలని నిర్ణయించుకుంది.
చందూకు దూరపు బంధువు, ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలున్న భరత్ గుర్జార్ ను కలిసి తన ఆఫర్ చెప్పింది. దీంతో మరో ఆలోచన లేకుండా చందూను మద్యం సేవించడానికి పిలిచి, నిర్మానుష్య ప్రాంతంలో తల పగులగొట్టి హత్య చేశాడు. ఈ ఘటన 25వ తేదీ గురువారం జరిగింది. ఆపై మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్ వద్ద పడేయగా, గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, చందూను తీసుకెళ్లింది గుర్జార్ అని నిర్దారణకు వచ్చారు. ఆ వెంటనే గుర్జార్ ను, అతనికి ఆఫర్ ఇచ్చిన యువతిని, ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, గుర్జార్ కు అందాల్సిన ఒక రాత్రి ప్రతిఫలం దక్కకముందే విషయం మొత్తం బట్టబయలైంది.