కర్నూలు జిల్లాలో దారుణం.. సీతారాముల ఆలయ రాతి స్తంభాలు ధ్వంసం
- వెంకటనాయుని పల్లెలో నిర్మిస్తున్న సీతారాముల ఆలయం
- రాతి స్తంభాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- మరో వర్గంపై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల ధ్వంసం ఘటనలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని వెంకటనాయుని పల్లెలో శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణంలో ఉన్న సీతారాముల ఆలయ రాతి స్తంభాలను ధ్వంసం చేశారు. నిన్న ఉదయం ముక్కలైన స్తంభాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇస్తామని, సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని కోరింది. అయితే, ఇందుకు మరో వర్గం అంగీకరించకపోవడంతో ఎన్నికలు జరిగాయి. గెలిచిన అభ్యర్థి ఇచ్చిన మాట ప్రకారం రూ. 30 లక్షలు ఇచ్చాడు. అయితే, ఇప్పుడా ఆలయంపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.