డౌన్ సిండ్రోమ్ బాధితులకు కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్య జాబితాలో చోటు!

  • డౌన్ సిండ్రోమ్ బాధితులకు కరోనా ముప్పు మూడురెట్ల అధికం
  • ఇప్పటికే టీకాలు వేసిన యూకే, యూఎస్, స్పెయిన్
  • శారీరక, మానసిక ఎదుగుదలను ఆపేసే డౌన్ సిండ్రోమ్
కరోనా హైరిస్క్ జాబితాలో ఉన్న డౌన్ సిండ్రోమ్‌ బాధితులను టీకా ప్రాధాన్య క్రమంలో చేర్చాలని భారత్ నిర్ణయించింది. ఇంగ్లండ్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే వీరికి ముందుగా టీకాలు అందించగా, ఇప్పుడు భారత్ కూడా వారిని ప్రాధాన్య క్రమంలో చేర్చాలని నిర్ణయించింది. డౌన్ సిండ్రోమ్ బాధితుల్లో కరోనా ముప్పు ఎక్కువని లాన్సెట్ జర్నల్ గతంలో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్థులు మూడు రెట్లు ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉందని, అలాగే, మరణానికి గురయ్యే అవకాశం కూడా ఉన్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు వీరిని టీకా ప్రాధాన్య క్రమంలో చేర్చాయి.

ఇక, మన దేశంలో ఏడాదికి 30 వేల డౌన్ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సిండ్రోమ్ కారణంగా, శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారిని హై రిస్క్ జాబితాలో చేర్చాలని తమ తరువాతి సమావేశంలో ప్రతిపాదిస్తామని జాతీయ టీకా నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్ సమీరన్ పండా తెలిపారు.


More Telugu News