జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం.. యూట్యూబర్ అరెస్ట్

  • రోడ్ నెం.10లో దూసుకొచ్చిన కారు
  • రెండు కార్లు, రెండు బైకులను ఢీకొన్న వైనం
  • ఓ బైకర్ కు తీవ్ర గాయాలు
  • కారు నడిపింది షణ్ముఖ్ జశ్వంత్ అని గుర్తింపు
  • మద్యం మత్తులో కారు నడిపినట్టు వెల్లడి
  • అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాదులో వనస్థలిపురంలో కారు బీభత్సం ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన కొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ లోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.10లో ఓ కారు వేగంగా దూసుకొచ్చి రెండు కార్లు, మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బైకర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

కాగా, ప్రమాదానికి కారణమైన కారును నడుపుతున్నది ప్రముఖ తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అని గుర్తించారు. డ్రైవింగ్ సమయంలో షణ్ముఖ్ మద్యం సేవించినట్టు వెల్లడైంది. బ్రీత్ అనలైజర్ రీడింగ్ లో 170 పాయింట్లు చూపించినట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్ ను అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.


More Telugu News