బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు: ప్రకాశ్ జవదేకర్
- తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు
- రామచంద్రరావు గెలుపు ఖాయమన్న జవదేకర్
- అందుకే టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కామెంట్
- టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని వ్యాఖ్యలు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు తథ్యమని తెలిసిన టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగుతున్నారని అన్నారు. తమ అభ్యర్థి రామచంద్రరావును చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ నేతలు రామచంద్రరావుపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు వారు భయపడుతున్న విషయాన్ని ఎత్తిచూపుతున్నాయని వివరించారు. టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీ అని, అలాంటి పార్టీలతో అభివృద్ధి జరగదని అన్నారు. పేదలను అభివృద్ధి పథంలో నడిపించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు.
కాగా, ఇటీవలే ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ... తమ అగ్రనేతల ప్రచారంతో బాగానే లాభపడింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడా ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ వంటి ముఖ్యనేతలను తీసుకురావాలని భావిస్తోంది.