కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన
- నెల్లూరు జిల్లాలో ఘటన
- ఓ కుమార్తెకు వైద్యం చేయించేందుకు మరో కుమార్తె అమ్మకం
- 12 ఏళ్ల బాలికను కొనుక్కుని పెళ్లి చేసుకున్న వ్యక్తి
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
నెల్లూరులో కూలీనాలీ చేసుకునే దంపతులు ఒక కుమార్తెకు చికిత్స చేయించేందుకు డబ్బుల్లేక మరో కుమార్తెను రూ.12 వేలకు విక్రయించిన ఘటన అందరినీ కలచివేసింది. ఆ బాలికను కొనుగోలు చేసిన 46 ఏళ్ల వ్యక్తి ఆమెను పెళ్లాడాడు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన అత్యంత బాధాకరమే కాకుండా, ఏపీలో ఆరోగ్య భద్రత దిగజారిపోతోందన్నదానికి నిదర్శనమని పేర్కొన్నారు. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన ప్రభుత్వానికి మేల్కొలుపు అని స్పష్టం చేశారు. పేదవాళ్లకు లబ్ది చేకూర్చని ఈ సంక్షేమ పథకాలు ఎవరి కోసం? అని మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పలకు పోకుండా, ఏపీలో సంక్షేమ పథకాలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలని చంద్రబాబు హితవు పలికారు.