ఏపీ డీజీపీకి మరోసారి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు
- ఇల్లపల్లి సర్పంచ్ గా వైసీపీ మద్దతుదారు గెలిచాడన్న చంద్రబాబు
- టీడీపీ సానుభూతిపరులను ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపణ
- టీడీపీ కార్యకర్తపై దాడి చేశారని వెల్లడి
- గాయపడిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని వెల్లడి
- చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ముగిసింది. ఆయన బెంగళూరు చేరుకుని అక్కడ్నించి హైదరాబాద్ పయనమవుతారు. కాగా, టీడీపీ మద్దతుదారులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నాంటూ చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.
బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైసీపీ మద్దతుదారు సర్పంచ్ గా గెలిచిన అనంతరం టీడీపీ సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. పోలీసుల్లోని ఓ వర్గం సాయంతో వారిపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నాడని పేర్కొన్నారు.
'ఇంట్లో పసిబిడ్డలు ఉన్నారు.. ఇంటి ముందు టపాసులు కాల్చవద్దన్న' రాఘవ అనే టీడీపీ కార్యకర్తపైనా, అతడి కుటుంబసభ్యులపైనా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కానీ, దాడి చేసిన వారిపై కాకుండా దాడిలో గాయపడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం ఏంటని చంద్రబాబు డీజీపీని ప్రశ్నించారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా చూడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డీజీపీకి స్పష్టం చేశారు.