మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం చేపడతాం: కమలహాసన్
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- ఏప్రిల్ 6న పోలింగ్
- ప్రచార బరిలో పార్టీలు
- పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్న కమల్
- మార్చి 7న అభ్యర్థుల తొలి జాబితా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రచార అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఏప్రిల్ 6న తమిళనాడులో ఎన్నికలు జరగనుండడంతో నెల రోజుల పాటు హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాయి.
మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ కూడా ప్రచారం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కమల్ వెల్లడించారు. ప్రస్తుతం పొత్తులపై ఇతర పార్టీలతో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. పొత్తులు ఖరారు అయ్యాక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఎంఎన్ఎం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 7న విడుదల చేస్తామని కమల్ తెలిపారు.