ఇప్పటిదాకా 1.37 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం... విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి పువ్వాడ
- ఎన్నికల హామీలపై కేసీఆర్ మోసం చేశాడంటున్న విపక్షాలు
- ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని ఆరోపణ
- విపక్షాల ఆరోపణలను ఖండించిన మంత్రి పువ్వాడ
- తమ సవాల్ కు విపక్షాలు స్పందించడంలేదని వ్యాఖ్య
- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే మోసం చేసిందన్న మంత్రి
సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేశాడంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తప్పుబట్టారు. ఉద్యోగాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 1.37 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, కానీ ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వ కృషితో తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని, నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తోందని అన్నారు.
ఉద్యోగ నియామకాలపై తాము సవాల్ విసిరినప్పటికీ విపక్షాలు స్పందించడంలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వమే మోసం చేస్తోందని, ఈ ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి పువ్వాడ నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారు. అసలు, దేశంలో నిరుద్యోగం ప్రబలడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు.