అగ్ని ప్రమాదం నుంచి రక్షించేందుకు.. మూడో అంతస్తు నుంచి పిల్లల్ని విసిరేసిన తల్లి.. వీడియో ఇదిగో
- టర్కీలో ఘటన
- కింద నిలబడి బ్లాంకెట్లతో క్యాచ్ పట్టిన స్థానికులు
- నలుగురు పిల్లలు, తల్లి సురక్షితం
అగ్ని ప్రమాదం నుంచి తన నలుగురు పిల్లల్ని రక్షించుకునేందుకు వారిని ఓ తల్లి అపార్ట్‌మెంటు మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది. దీంతో కింద ఉన్న వారు బ్లాంకెట్ల సాయంతో పట్టుకుని రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ అగ్ని ప్రమాద ఘటన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకుంది. ఆ మహిళ నివాసం ఉంటోన్న ఫ్లాట్ ద్వారం నుంచి వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం, మంటలు పెరిగిపోతుండడం వల్ల ఆమె తన పిల్లలను ఇలా కిందకు జారవిడిచింది.
స్థానికులు అప్పటికే బ్లాంకెట్లతో అక్కడ సిద్ధంగా ఉండి, సమయస్ఫూర్తితో వ్యవహరించి పిల్లల ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత ఈ ప్రమాదం నుంచి తల్లి కూడా బయటపడింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.