జగన్ సీఎం అయిన తొలి నెలలోనే పోస్కో ప్రతినిధులు ఆయనను కలిశారు: టీడీపీ నేత పట్టాభి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తొలి ముద్దాయి జగన్
- ప్రతి విషయం జగన్ కు తెలిసే జరిగింది
- ఈ విషయాన్ని నీతిఆయోగ్ సమావేశంలో ఎందుకు లేవనెత్తలేదు?
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ వైజాగ్ లో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ప్రథమ ముద్దాయి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రతి విషయం జగన్ కు తెలిసే జరిగిందని అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి నెలలోనే (2019 జూన్) పోస్కో ప్రతినిధులు ఆయనను కలిశారని పట్టాభి చెప్పారు. 2019 జులైలో స్టీల్ అధికారులకు పోస్కో ప్రతినిధులు ప్రపోజల్ అందించారని తెలిపారు. అదే సంవత్సరం అక్టోబరులో ఎంఓయూ చేసుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంటులో ఎందుకు లేవనెత్తలేదని నిలదీశారు.
విశాఖ స్టీల్ కు సంబంధించి ప్రతి ఘట్టానికి ముందు, వెనక పోస్కో ప్రతినిధులు జగన్ నో, విజయసాయిరెడ్డినో కలిశారని పట్టాభి చెప్పారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీతిఆయోగ్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదని చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన పనులను జగన్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.