మునిసిపల్ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి విమర్శలు
- వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి... టీడీపీ మేనిఫెస్టో
- "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట
- అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే
- అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిన్న టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. 10 అంశాలను పొందుపర్చుస్తూ 'పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు' పేరిట ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. తమ నవరత్నాలను కాపీ కొట్టారని చెప్పుకొచ్చారు.
వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి... టీడీపీ పప్పు మునిసిపల్ మేనిఫెస్టో విడుదల చేశాడు. దానిపేరు "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట. అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే. అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ! అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.