మ‌రికాస్త పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

  • ఢిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసల పెంపు
  • లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17, డీజిల్‌ ధర రూ.81.47
  • హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ రూ.94.79
  • విజ‌య‌వాడ‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.97.68
దేశంలో మూడు రోజుల పాటు పెర‌గ‌కుండా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు మ‌ళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున‌ పెంచాయి. ఈ నెల‌లో 16వ సారి వాటి ధ‌ర‌లు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. పెంచిన ధ‌ర‌ల నేప‌థ్యంలో... ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17గా, డీజిల్‌ ధర రూ.81.47గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు పెర‌గ‌డంతో దాని ధర రూ.94.79కి చేరింది.  డీజిల్‌పై లీట‌రుకు 17 పైసలు పెంచ‌డంతో రూ.88.86కి ఎగ‌బాకింది. విజ‌య‌వాడ‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.97.68గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ.91.18కి పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.97.57, డీజిల్‌ రూ.88.70గా ఉంది.  




More Telugu News